కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ సాహసం దేశానికి గర్వకారణమన్న కిషన్ రెడ్డి
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
తీవ్ర గాయాలపాలైనప్పటికీ ప్రాణాలకు తెగించి వందలాది మంది ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలు దేశానికి గర్వకారణమని కేంద్ర మంత్రి G Kishan Reddy కొనియాడారు. ముప్పు వాటిల్లిన తరుణంలో ఆయన చూపిన నిబ్బరం, స్వార్థరహిత అంకితభావం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, కెప్టెన్ మచ్ఛర్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆయన చూపిన తెగువ దేశం మొత్తానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు.