మృతుల కుటుంబాలను పరామర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా తాండూరు మండల బీజేపీ సీనియర్ నాయకుడు చిలువేరు శేషగిరి తండ్రి సుదర్శన్ మృతి చెందడంతో ఆయన స్వగ్రామమైన బీమిని మండలం జగ్గయ్యపేటలో కుటుంబ సభ్యులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పరామర్శించారు. అనంతరం వడాల గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పంజాల రామచందర్ గౌడ్ కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, జిల్లా ఉపాధ్యక్షుడు పట్టి కృష్ణ, జిల్లా కార్యదర్శులు శ్రీధర్, రాచర్ల సంతోష్, మండల అధ్యక్షుడు కొంక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.