భారత్ తో తొలి వన్డేకు దూరమైన న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఆక్లాండ్
భారత్ తో బుధవారం జరగనున్న తొలి వన్డే మ్యాచ్ కు న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే దూరమయ్యాడని ఆ దేశ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ప్రాక్టీస్ సెషన్ లో తోటి ఆటగాడు మాట్ హెన్రీతో ఢీకొనడంతో కాన్వే తలకు బలమైన గాయమైందని, ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా కంకషన్ కు గురైనట్లు నిర్ధారణ అయిందని కివీస్ బోర్డు పేర్కొంది. కాన్వే స్థానంలో టిమ్ సీఫెర్ట్ బరిలోకి దిగుతాడని కెప్టెన్ మిచెల్ శాంట్నర్ స్పష్టం చేశారు.