తాళ్లూరు మండలంలో కుండబోత వర్షం విద్యుత్ సరఫరా నిలిపివేత

రిపోర్టర్: సురేష్ స్థలం: తాళ్లూరు

తాళ్లూరు మండలంలో గురువారం రాత్రి గంటపాటు కుండబోత వర్షం కురిసి 5.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏఈ రామకృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.