రాజమౌళి వారణాసి చిత్రంపై అంచనాలు: కొత్త ప్రాచీన భాషతో భారీ ప్రయోగం

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంలో మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, కథలో భాగంగా ప్రత్యేకంగా ఓ కల్పిత ప్రాచీన భాషను రూపొందిస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ ఫాంటసీ చిత్రాల తరహాలో సొంత పదాలు, వ్యాకరణ నియమాలతో ఈ భాష ఉండనుందని, ఇది కథను ముందుకు నడిపించడంలో కీలకమైన పాత్ర పోషించనుందని చిత్ర యూనిట్ తెలిపింది.