నేటి నుంచి దేశవ్యాప్తంగా బీజేపీ సేవా సంకల్ప్ యాత్ర

రిపోర్టర్: హరి స్థలం: భారతదేశం

భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రజలతో మమేకం అయ్యేందుకు ఈ నెల 17వ తేదీ నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తెలంగాణతో పాటు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఈ యాత్రను విస్తృతంగా అమలు చేయనున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలను వివరించి అట్టడుగు స్థాయి ఓటు బ్యాంకును పటిష్టం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.