తీవ్ర తుపాను బీభత్సం: ఏపీలో అస్తవ్యస్త జనజీవనం, నలుగురు దుర్మరణం
రిపోర్టర్: విజయ్
స్థలం: బాపట్ల
ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర తుపాను విరుచుకుపడటంతో పలు జిల్లాల్ లో ఈదురుగాలులు, భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైందని అధికారులు తెలిపారు. పెద్దచెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్ లో పంటలు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను ధాటికి వేర్వేరు ఘటనల్ లో నలుగురు మృతిచెందగా, మరో నలుగురు గల్లంతయ్యారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.