ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

రిపోర్టర్: కిరణ్ స్థలం: జగిత్యాల

రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఎంపీడీవోలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించి ప్రొసీడింగ్స్ అందజేయాలని సూచించారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.