పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి పోటెత్తిన అభిమానం
రిపోర్టర్: T. SRAVAN
స్థలం: పెద్దపల్లి
అమెరికా పర్యటన ముగించుకుని పెద్దపల్లికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరి మనోహర్ రెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బస్టాండ్ లో ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో సత్కరించారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.