వైరల్ అవుతున్న సుకుమార్ దంపతుల 80s ఏఐ ఫోటోలు
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ టెక్నాలజీతో జనరేట్ చేసిన ఎనైటీస్ లుక్స్ ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ట్రెండ్‌లో భాగంగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సుకుమార్ తన భర్తతో కలిసి ఉన్న పాత కాలపు నాటి జ్ఞాపకాలను తలపించేలా ఏఐ ద్వారా రూపాంతరం చెందించిన ప్రత్యేక ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రెండీ పిక్స్ నెట్టింట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.