ఆయుర్వేద దినోత్సవంలో ఆరోగ్య సందేశం
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
నేలకొండపల్లి: ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలని సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ మంగళ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుర్వేద దినోత్సవం నిర్వహించారు. ధన్వంతరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైద్య శిబిరం నిర్వహించి ఆరోగ్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఆయుర్వేదం, ఔషధ మొక్కల ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, యోగా ఇన్‌స్ట్రక్టర్లు పాల్గొన్నారు.