కోల్కతా నగ్న ప్రదర్శన ఘటన: నిందితులను అరెస్ట్ చేసి సీన్ రీకన్స్ట్రక్షన్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Kolkata

కోల్కతాలో సంచలనం సృష్టించిన నగ్న ప్రదర్శన ఘటనకు సంబంధించి నిందితులందరినీ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బేహాలాలోని సర్సూనా ప్రాంతంలో జరిగిన ఈ దారుణ ఘటనపై బాధితుల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ 25న యువకులను బెదిరించి వివస్త్రలుగా నడిపించిన కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ టేజ్ సేకరించి ఆయుధాల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.