సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే తాటతీస్తామన్న గౌతు శిరీష
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
పలాస మున్సిపాలిటీ ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గౌతు శిరీష హెచ్చరించారు. గతంలో జరిగిన దౌర్జన్యాలు ప్రజలకు తెలుసని ఆమె స్పష్టం చేశారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలని కోరుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని ఆమె తేల్చిచెప్పారు.