మహిళలపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా దిల్లీ సచివాలయం ముట్టడి
రిపోర్టర్: గోపి
స్థలం: New Delhi
దేశ రాజధాని దిల్లీలో మహిళలు మరియు బాలికలపై పెరుగుతున్న అఘాయిత్యాలను నివారించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు. మహిళా భద్రతకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు దిల్లీ సచివాలయాన్ని ముట్టడించి తీవ్ర ఆందోళన చేపట్టాయి. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ ప్రతినిధి బృందం అధికారులకు వినతిపత్రం సమర్పించి భద్రతా చర్యలు కల్పించాలని కోరినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.