అక్టోబర్ ఆరున ఆదర్శ కుటుంబం ట్రైలర్ విడుదలని వెల్లడించిన నాగవంశీ

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమా ట్రైలర్ను అక్టోబర్ ఆరున విడుదల చేయనున్నట్లు నిర్మాత నాగవంశీ వెల్లడించారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ తొమ్మిదిన థియేటర్లలో విడుదల కానుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ ఏడు నుంచి టికెట్ విక్రయాలు ప్రారంభం కానున్నట్లు ఆయన తెలిపారు. కుటుంబ ప్రేక్షకులను అలరించేలా కామెడీ, యాక్షన్ భావోద్వేగాలతో ఈ సినిమాను రూపొందించినట్లు నాగవంశీ స్పష్టం చేశారు.