సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా పట్టుబడ్డ నకిలీ కరెన్సీ నోట్లు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా నకిలీ నోట్లు పట్టుబడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రాజస్థాన్ కు చెందిన శివరతన్ మహియాను ముంబై ఎల్ టీటీ ఎక్సప్రెస్ లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అతని వద్ద నుంచి అరవై లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రధాన నిందితుడు ఓం ప్రకాష్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు వివరించారు.