దేశాన్ని పూర్తిగా డ్రగ్స్ రహితంగా మారుస్తామన్న అమిత్ షా

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఢిల్లీ

దేశ భద్రతకు పెనుముప్పుగా మారుతున్న మాదకద్రవ్యాల రవాణాపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, డిసెంబర్ 31, 2029 నాటికి దేశం నుంచి డ్రగ్స్ వ్యాపారాన్ని పూర్తిగా నిర్మూలించాలనే పక్కా లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. సరిహద్దుల వద్ద నిఘాను కట్టుదిట్టం చేయడంతో పాటు అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పరస్పర సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.