త్రిపుర క్రికెట్ అసోసియేషన్ వార్షిక పురస్కారాల వేడుకలో సీఎం సాహా

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అగర్తల

అగర్తల వేదికగా జరిగిన త్రిపుర క్రికెట్ అసోసియేషన్ వార్షిక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో క్రీడాకారులను అభినందించడంతో పాటు పలువురికి అవార్డులను ప్రదానం చేశారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.