కాంగ్రెస్ ప్రభుత్వం కాలం చెల్లడం త్వరలోనే ఖాయమంటూ బీజేపీ తెలంగాణ విమర్శ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Hyderabad

ప్రభుత్వ సంక్షేమ పథకాలను గంగమ్మ తల్లికి అప్పజెప్పిన కాంగ్రెస్ సర్కార్‌ నిమజ్జనం ఖాయమని బీజేపీ తెలంగాణ తీవ్రస్థాయిలో విమర్శించింది. ప్రజలందరికీ నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మేరకు అధికారిక సామాజిక మాధ్య వేదికగా ఆ పార్టీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ప్రజల తరఫున నిలదీస్తున్నట్లు తెలిపారు. ఈ రాజకీయ విమర్శలపై అధికారిక వర్గాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.