మున్సిపల్ ఎన్నికలు సెలెక్షన్లుగా మారాయంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల సరళిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. నామినేషన్ల నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశను అధికార కూటమి ప్రభుత్వం హైజాక్ చేసిందని ఆయన మండిపడ్డారు. ఇవి ప్రజాస్వామ్య బద్ధమైన ఎన్నికలు కాదని, కేవలం సెలెక్షన్లు మాత్రమేనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పోలీస్ శాఖ మరియు ఎన్నికల సంఘం తీరును ఆయన ఎద్దేవా చేశారు.