సినిమా సెన్సార్ పై సీబీఎఫ్సీ కొత్త మార్గదర్శకాలు: ఇకపై ఫైనల్ వెర్షన్ తప్పనిసరి

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

సినిమాల సెన్సార్ ప్రక్రియపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కీలకమైన కొత్త మార్గదర్శకాలను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇకపై నిర్మాతలు తమ చిత్రాలను సెన్సార్ బోర్డుకు పంపించే ముందు గ్రాఫిక్స్, టైటిల్స్, సబ్ టైటిల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ తో కూడిన పూర్తి స్థాయి ఫైనల్ వెర్షన్ ను మాత్రమే సమర్పించాలని స్పష్టం చేశారు. అలాగే డ్రగ్స్, మహిళలపై హింసను చూపించే సీన్లపై కఠిన నిబంధనలు విధిస్తూ యూఏ రేటింగ్స్ లో కూడా కీలక మార్పులు చేసినట్లు వెల్లడించారు.