దేశ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి అత్యంత కీలకమని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: New Delhi
దేశ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం అత్యంత కీలకమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన మూడో ఎడిషన్ డిఫెన్స్ డైలాగ్ లో ఆయన మాట్లాడుతూ, కేవలం ఆధునిక ఆయుధాలు ఉండటం సరిపోదని, సాంకేతిక మరియు పారిశ్రామిక తయారీలో భారత్ స్వతంత్రత సాధించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ యుద్ధ రంగాలను ఎదుర్కొనేందుకు దేశీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.