నిమ్స్‌లో ఉద్యోగులకు ఉచిత ఓపీ సేవలు: మంత్రి దామోదర్ రాజనర్సింహ
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) కింద అవుట్ పేషెంట్ (OP) సేవలను యథావిధిగా ఉచితంగా అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. కొత్త నిబంధనలతో సంబంధం లేకుండా ఉద్యోగుల ఆరోగ్య ప్రయోజనాలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్‌కు ఈ మేరకు కీలక సూచనలు జారీ చేశారు.