కొలెస్ట్రాల్‌ను తగ్గించే దివ్యమైన ఆహారాలు: డాక్టర్ సుజాత స్టీఫెన్ కీలక సూచనలు
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే గుండె పోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయని యశోద హాస్పిటల్స్ చీఫ్ డైటీషియన్ డాక్టర్ సుజాత స్టీఫెన్ వెల్లడించారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆలివ్ ఆయిల్, అవిసెలు, చియా గింజలు, అవకాడో, వాల్నట్స్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు సరైన జీవనశైలితో పాటు మంచి పోషకాహారం తీసుకోవడం ద్వారా ప్రాణాంతక వ్యాధుల నుంచి సులభంగా రక్షణ పొందవచ్చని సూచించారు.