నేరాలపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థినులకు పిలుపునిచ్చిన న్యాయమూర్తి స్పందన
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: అచ్చంపేట
విద్యార్థినిలు సమాజంలో జరుగుతున్న నేరాలపై అవగాహన కలిగి ఉండాలని అచ్చంపేట జూనియర్ సివిల్ జడ్జి స్పందన సూచించారు. సురక్షిత్ బచ్పన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం అచ్చంపేట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల మధ్యాహ్న భోజనం మరియు వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్సై నరేష్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.