పారదర్శక జాతీయ పరీక్షా విధానాన్ని రూపొందించాలి: సీఎం చంద్రబాబు కీలక సూచనలు

రిపోర్టర్: నరేష్ స్థలం: అమరావతి

దేశంలోని అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకమైన జాతీయ పరీక్షల విధానాన్ని రూపొందించాలని పరీక్షల సంస్కరణల ఉన్నతస్థాయి టాస్క్ఫోర్స్ కు సీఎం చంద్రబాబు సూచించారు. సచివాలయంలో టాస్క్ఫోర్స్ ఛైర్మన్ నందన్ నీలేకని, మంత్రి నారా లోకేశ్ లతో ఆయన సమావేశమయ్యారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా, అందరికీ సమాన అవకాశాలు లభించేలా సంస్కరణలు ఉండాలని ఈ భేటీలో స్పష్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు.