గాయకుడు సోను నిగమ్ కన్సర్ట్ను అడ్డుకుంటామంటూ కర్ణాటక రక్షణ వేదిక హెచ్చరిక
రిపోర్టర్: అశోక్
స్థలం: బెంగళూరు
కన్నడిగలను అవమానించిన ప్రముఖ గాయకుడు సోను నిగమ్ నగరంలో నిర్వహించ తలపెట్టిన సంగీత కన్సర్ట్కు అనుమతి నిరాకరించాలని బెంగళూరు పోలీసు కమిషనర్‌ను కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు టి.ఎ. నారాయణ గౌడ కోరారు. ఈ షోను కొనసాగిస్తే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు చేపడతామని, శాంతిభద్రతల సమస్య తలెత్తితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ సంస్థ హెచ్చరించినట్లు ఆయన తెలిపారు.