దిగ్గజ దర్శకుడు భారతీరాజా చివరి సినిమా 'పులవర్' టీజర్ విడుదల
రిపోర్టర్: సురేష్
స్థలం: తమిళనాడు
తమిళ దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా చివరిసారిగా నటించిన చిత్రం 'పులవర్'. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోలీస్ స్టేషన్ నేపథ్యంలో హత్య కేసు విచారణ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. మురుగయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతీరాజాను చివరిసారిగా వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.