ది ప్యారడైజ్ ప్రీ రిలీజ్ వేడుకలో రాఘవ్ జుయల్ అదిరిపోయే డ్యాన్స్

రిపోర్టర్: సతీష్ స్థలం: Hyderabad

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ తన ప్రత్యేకమైన స్లో మోషన్ డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆయా షేర్ పాటకు స్టెప్పులేయడంతో పాటు యాంకర్ సుమతో కలిసి చేసిన నృత్యం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.