నూజివీడులో టిడ్కో ఇళ్ల పంపిణీ: డిసెంబర్ నుంచి లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు
రిపోర్టర్: శివ
స్థలం: ఏలూరు
పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా నూజివీడులో రెండు వేల ఆరు వందల నలభై టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయని గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ నిర్మాణాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన ప్రత్యేక చొరవతో పనులు పునఃప్రారంభించామని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి అర్హులైన పేదలకు ఇళ్లను కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు.