ఏపీలో వర్షాభావంతో ఎండిపోతున్న ఖరీఫ్ పంటలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు పూర్తిగా తగ్గిపోవడంతో ఖరీఫ్ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సాగునీరు అందక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారు. సుమారు రూ.2,300 కోట్లకు పైగా పెట్టుబడులు నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, సమగ్ర సర్వే నిర్వహించి పరిహారం అందించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.