జనన మరణాల నమోదులో కీలక మార్పులు తీసుకొచ్చిన కేంద్రం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
భారతదేశంలో జనన, మరణాల నమోదు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువచ్చిందని గణాంకాల శాఖ కార్యదర్శి రవికుమార్ సుర్పూర్ తెలిపారు. అక్టోబర్ 1, 2026 నుండి నూతన నిబంధనలు అమల్లోకి రానున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఏడాది దాటితే మేజిస్ట్రేట్ తనిఖీ తప్పనిసరి అని, రెండేళ్లు దాటితే కోర్టు అనుమతితోనే నమోదుకు అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. నకిలీ పత్రాలను అరికట్టి డేటాలో పారదర్శకత పెంచడమే ఈ చట్ట సవరణ ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది.