ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం విశాఖకు చెందిన అత్తాకోడళ్లు మృతి

రిపోర్టర్: కృష్ణ స్థలం: విశాఖపట్నం

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నానికి చెందిన అత్తాకోడళ్లు రమాదేవి, నేహ దుర్మరణం చెందారు. విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ మాజీ జాయింట్ సెక్రటరీ జీటీ ప్రసాద్ కుటుంబం శుభకార్యం నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లగా ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి జరిగిన ఈ దుర్ఘటనలో ప్రసాద్ భార్య, కోడలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ప్రసాద్ గాయాలతో బయటపడ్డారు. మృతదేహాలను విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.