సాలూరు అభివృద్ధికి నిధుల కొరత ఉండదన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

రిపోర్టర్: నరేష్ స్థలం: పార్వతీపురం మన్యం

సాలూరు అభివృద్ధికి పటిష్టమైన అడుగులు వేస్తున్నట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. గత పాలకవర్గం హయాంలో నిధుల కొరతతో మున్సిపాలిటీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని, చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయత్వంలోని చంద్రన్న ప్రభుత్వంలో ఇకపై సాలూరు అభివృద్ధికి ఎటువంటి నిధుల కొరత ఉండదని భరోసా కల్పించారు.