నంద్యాల జిల్లాలో ఇన్‌స్టాగ్రామ్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠా అరెస్టు

రిపోర్టర్: కృష్ణ స్థలం: నంద్యాల

నంద్యాల జిల్లాలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అమాయకులను మోసం చేస్తూ భారీగా డబ్బులు కాజేస్తున్న ఇద్దరు సభ్యుల సైబర్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ సునీల్ వెల్లడించిన వివరాల ప్రకారం నిందితులు శ్రీకాంత్, ప్రకాష్ నాయుడు నకిలీ ప్రొఫైళ్లతో బాధితులను ట్రాప్ చేసి నగదు వసూలు చేసేవారు. నిందితుల నుంచి రూ. 25 లక్షల నగదు, నాలుగు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.