భారతీయ పైలట్‌కు నివాళి: షారుఖ్ ఖాన్ పాటతో ఇజ్రాయెలీ గాయకుడి అరుదైన గౌరవం
రిపోర్టర్: సతీష్
స్థలం: Dubai
ఫ్లైదుబాయ్ విమానంలో ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్ఛర్‌కు ఇజ్రాయెలీ-అమెరికన్ గాయకుడు ఇతాయ్ బెండా వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని పలువురు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కో-పైలట్ దాడిని ధైర్యంగా ఎదుర్కొని ప్రయాణికులను రక్షించిన కెప్టెన్ మచ్ఛర్ సాహసాన్ని ప్రశంసిస్తూ, షారుఖ్ ఖాన్ నటించిన చిత్రంలోని హిందీ పాటను ఆలపించి ఘనంగా నివాళి అర్పించారు.