ఆసియా కప్: పాకిస్థాన్‌తో నేడు భారత్ హై-వోల్టేజ్ పోరు

రిపోర్టర్: సురేష్ స్థలం: World

మహిళల టీ20 ఆసియా కప్ 2026లో భాగంగా నేడు దుబాయ్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే సెమీస్ చేరిన హర్మన్‌ప్రీత్ సేన, చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఓడించి గ్రూప్ టాపర్‌గా నిలవాలని పట్టుదలగా ఉంది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసిరానుంది. పాక్ బ్యాటింగ్ బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆధిపత్యం ప్రదర్శించేందుకు టీమిండియా సిద్ధమైంది. రాత్రి 8 గంటలకు ఈ కీలక మ్యాచ్ ప్రారంభం కానుంది.