లండన్ పర్యటనపై ముఖ్యమంత్రి విజయ్‌ను నిలదీసిన డీఎంకే అధినేత స్టాలిన్

రిపోర్టర్: వెంకట్ స్థలం: తమిళనాడు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ లండన్ పర్యటనపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన ముప్పెరుమ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు తెచ్చేందుకు విజయ్ లండన్ వెళ్లారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, నిత్యం హత్యలు, కత్తులతో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.