కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలపై జగదీష్ రెడ్డి నిరసన
రిపోర్టర్: రమేష్
స్థలం: యాదాద్రి భువనగిరి
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో ప్రజల ఆశలు అడియాశలయ్యాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. భువనగిరిలో విద్యార్థులతో కలిసి ఆయన నిరసన చేపట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బకాయిలు చెల్లించే వరకు పోరాటం ఆపేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కంచర్ల రామకృష్ణారెడ్డి, పైల శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.