రైతన్నలకు తీపి కబురు: పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం
రిపోర్టర్: శివ
స్థలం: గుంటూరు
రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా సహాయం అందిస్తాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్ లో ఆయన పర్యటించారు. నీట మునిగిన పంటలను పరిశీలించి రైతుల గోడును అడిగి తెలుసుకున్నారు. ఈ-క్రాప్ బుకింగ్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి రైతుకు పరిహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.