జర్నలిస్ట్ కరిష్మా అజీజ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశం

రిపోర్టర్: విజయ్ స్థలం: ఢిల్లీ

సోషల్ మీడియాలో హిందూ మత పెద్దలు, చారిత్రక వ్యక్తులు మరియు భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారనే ఆరోపణలపై జర్నలిస్ట్ కరిష్మా అజీజ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని న్యూఢిల్లీలోని సైబర్ పోలీస్ స్టేషన్‌ను పాటియాలా హౌస్ కోర్టు గురువారం ఆదేశించింది. న్యాయవాది అమితా సచ్‌దేవా దాఖలు చేసిన ఫిర్యాదును పరిశీలించిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మృదుల్ గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేస్తూ, ఒక వారంలోగా అమలు నివేదికను సమర్పించాలని ఆదేశించారు.