తంజీమ్-ఎ-ఇన్సాఫ్ నూతన కమిటీ ఎన్నిక: ఖమ్మంలో ఘనంగా సమావేశం నిర్వహణ
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం ఖానాపురం హవేలీ సీపీఐ కార్యాలయంలో తంజీమ్-ఎ-ఇన్సాఫ్ శాఖ సమావేశం జరిగింది. షేక్ రఫీ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాఖ అధ్యక్షుడిగా షేక్ అక్రమ్ బాధ్యతలు స్వీకరించారు. సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర, జిల్లా నాయకులు పిలుపునిచ్చారు.