విశాఖలో మిషన్ జ్యోతిర్గమయ: ఆకలితో ఉన్నవారికి ఉచితంగా ఆహార వితరణ

రిపోర్టర్: మహేష్ స్థలం: విశాఖపట్నం

ఆహారం వృథా కాకుండా ఆకలితో ఉన్న నిరాశ్రయులకు ఉచితంగా అందించే సేవలను విశాఖ నగర పోలీసులు నిరంతరం కొనసాగిస్తున్నారని VizagCityPolice వెల్లడించారు. నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తలపెట్టిన మిషన్ జ్యోతిర్గమయ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఐదు కమ్యూనిటీ ఫ్రిజ్ల ద్వారా ప్రతిరోజూ అవసరమైన వారికి ఉచితంగా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎవరూ ఆకలితో ఉండకూడదనే మానవతా దృక్పథంతో ఈ వినూత్న సేవలు చేపట్టినట్లు పేర్కొన్నారు.