డెమొగ్రఫీ కమిషన్ డేటా సేకరణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అక్బరుద్దీన్ ఓవైసీ

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

డెమొగ్రఫీ కమిషన్ ద్వారా సేకరిస్తున్న సమాచారంపై ఏఐఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏ మతానికి చెందిన ప్రజలు ఎన్ని వాహనాలు కొనుగోలు చేశారనే వివరాలు కూడా సేకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ డేటా సేకరణ ద్వారా ముస్లింలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని అక్బరుద్దీన్ ఓవైసీ ధ్వజమెత్తారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని ఈ కమిషన్ తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.