ఓట్ల చోరీ ఆరోపణలు: ఇండియా కూటమి అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: న్యూఢిల్లీ

ఓట్ల చోరీపై వినతిపత్రం సమర్పించేందుకు ఇండియా కూటమి నేతలు కోరిన భేటీని సీజేఐ సూర్యకాంత్ తిరస్కరించినట్లు వార్తలు వెలువడ్డాయి. కార్యనిర్వాహక వ్యవస్థ విధుల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన ఆయన, ఈ అంశంపై న్యాయపరంగా పిటిషన్ దాఖలు చేయాలని సూచించినట్లు పీటీఐ వెల్లడించింది. రాజ్యాంగబద్ధమైన హక్కుల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని సీజేఐ స్పష్టం చేశారు.