సింటా ఎన్నికలు చెల్లవని పూనమ్ ధిల్లాన్ సంచలన ప్రకటన
రిపోర్టర్: రాజేష్
స్థలం: India
సింటా అసోసియేషన్ పునర్నియమకాలపై వివాదం ముదిరింది. కోర్టు అనుమతి లేకుండా నిర్వహించిన ఈ ఎన్నికలను తాము గుర్తించడం లేదని నటి పూనమ్ ధిల్లాన్ స్పష్టం చేశారు. తమ పదవీకాలం 2027 వరకు ఉందని, ప్రత్యర్థుల విజయం కేవలం కల్పితమే అని మండిపడ్డారు. ఈ ఎన్నికల ప్రక్రియను చట్టపరంగా సవాల్ చేస్తామని తేల్చిచెప్పారు.