సింగరేణి ఉద్యోగాల పేరిట మోసం చేసిన ఆరుగురికి జైలుశిక్ష
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
సింగరేణిలో ఉద్యోగం పెట్టిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన కేసులో ఆరుగురు నిందితులకు మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. వీరయ్య మూడేళ్ల కారాగార శిక్ష విధిస్తూ బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. 2016లో జైపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ నేర ఘటనపై విచారణ అనంతరం కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది.