గణనాథుని సన్నిధిలో పులకించిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య భక్తి

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బూడిదగడ్డ బస్తీలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ విఘ్నేశ్వరుడిని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్, బీఆర్ఎస్ నాయకులు గోపాల్, సురేష్ తదితరులు ఘనంగా పాల్గొని పూజా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.