కాంగ్రెస్ కావాలనే కరువు తెచ్చిందంటూ రేవంత్ రెడ్డి సర్కార్ పై కేటీఆర్ ఆగ్రహం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Adilabad
ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా ముఖరా కే రోడ్డు వద్ద ఎండిపోయిన పత్తి పంటలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తెచ్చిన కరువు అని తీవ్రస్థాయిలో మండిపడ్డారని, ఎండిపోయిన పత్తి పంటకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు, సోయా పంటకు ఇరవై వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని నేతలు తెలిపారు.