గుండెపోటుతో విధుల్లోనే కుప్పకూలి మృతిచెందిన ఆర్టీసీ కండక్టర్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చింతకాని

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన సామినేని లక్ష్మీనారాయణ ఖమ్మం ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం నాడు విధుల్లో భాగంగా హైదరాబాద్ బస్ స్టేషన్ లో ఉండగా ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురైన లక్ష్మీనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన ఆకస్మిక మరణంతో ఆర్టీసీ డిపో సిబ్బందితో పాటు స్వగ్రామమైన పాతర్లపాడులో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.